నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురానగర్, ప్రశాంతి హిల్స్‌లలో శనివారం ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రతి విధిలో పాదయాత్ర నిర్వహిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మధురానగర్‌లో డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాధాన్యత క్రమంలో సమస్యలన్ని పరిష్కారమయ్యేలా చూస్తానని హీమి ఇచ్చారు. అనంతరం అధికారులతో మాట్లాడి సమస్యలకు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని స్థానికులకు ఆయన సూచించారు. అదేవిధంగా కరోన వ్యాధి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మహేశ్వరి, బీజేపీ నాయకురాలు వరలక్ష్మి, ఆర్ వెంకటేశ్వర్లు, రఘు, ఇంద్ర, సునీత, పద్మ, రమేష్, రాజు, రంజిత్, ఉదయ్ మరియు బస్తి వాసులు పాల్గొన్నారు.
