విస్త‌రిస్తున్న బ్లాక్ ఫంగ‌స్(మ్యూక‌ర్ మైకోసిస్‌) వ్యాధి… ప్ర‌త్యేక బృందంతో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో వైద్యం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కోవిడ్ వ్యాధితో ఒక వైపు దేశమంతా భాదపడుతుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి ప్రాణాంతకంగా మారుతోంది. కరోనా సోకి తగ్గిన వారు లేదా ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలతో భాదపడుతున్న వారిలో, మదుమేహం (చక్కెర వ్యాది) ఎక్కువగా ఉండి నియంత్రణలో లేని వారికి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్‌గా పిలువబడే మ్యూకర్ మైకోసిస్ వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధి సోకిన వారిలో అతితక్కువ సమయంలోనే ఫంగస్ ముక్కు, సైనస్ ల నుంచి కళ్లకు మరియు మెదడుకు పాకి ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. అయితే ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి శస్త్ర చికిత్స చేసి తగిన మందులు వాడడం వలన వ్యాప్తిని అరికట్టవచ్చ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో నానాటికీ ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి కేసులు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ఇలాంటి వారికి సరైన చికిత్స అందించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కలిగి ఉన్న నేపధ్యంలో ఈ వ్యాధితో భాదపడుతున్న వారికి అండగా నిలబడి అవసరమైన వైద్య సహాయం అందించాలని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లోని వైద్య బృందం నిర్ణయించింది ముందుకు వ‌చ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ENT, హెడ్ & నెక్ విభాగంలోని శస్త్ర చికిత్స నిపుణులు, న్యూరో సర్జన్స్, ఆప్తమాలజీ సర్జన్స్, రీకన్ట్స‌క్టీవ్‌ స‌ర్జ‌న్‌, మ్యాక్సిలో ఫేసియ‌ల్ స‌ర్జ‌న్‌, ఐసీయూ, అన‌స్థీషియా, ఇంటర్నల్ మెడిసన్, మెడికల్ ఆంకాలజీ, డయాబెటాలజీ, మైక్రో బయాలజీ వైద్యులతో కూడిన ప్ర‌త్య‌క‌ బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం సమగ్రమైన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ వ్యాధితో భాదపడుతున్న వారు తగిన సమాచారం కోసం 040-23551235, 040-23556655 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా హెడ్ & నెక్ విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here