నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తుందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ ప్రైమరీ స్కూల్ లో, సిద్దిఖ్ నగర్ లోని ప్రైమరీ స్కూల్ లో, మాదాపూర్ లోని ప్రైమరీ, జిల్లా పరిషత్ స్కూల్ లో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా మన ఊరు మన బడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, కుమ్మరి శ్రీను, నందు, సాగర్ చౌదరి, బుడుగు తిరుపతి రెడ్డి, ఆనంద్ చౌదరి, తాడెం మహేందర్, మొహ్మద్ అలీ, గఫూర్, సలీం పటేల్, కలీం, షబ్బీర్ అలీ, సర్తాజ్, హెచ్ఎంలు బసవ లింగం, కె. ఫీరోజీ, శ్రీలత, శ్యామ్ సుందర్ రెడ్డి, ఉపాధ్యాయులు బి. శ్రీధర్ రెడ్డి, రవి, గణేష్, ప్రకాష్, నరసింహులు, సువర్ణ, శ్వేత, హసీనా, జగతి, ప్రసన్న, బాలమణి, తదితరులు పాల్గొన్నారు.