నమస్తే శేరిలింగంపల్లి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత అలవడుతుందని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చెప్పారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మొహర్ పార్కు కాలనీ నేతాజీనగర్ లో గల శ్రీ సాయి బృందావన క్షేత్రంలో సాయినాథుని పుష్కర మహోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. 1008 కలశాలతో మహాఘటాభిషేకం గోపురం కలశానికి, సాయిబాబా విగ్రహానికి అభిషేకం, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు మాధవానంద స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు భక్తి ప్రవచనాలు బోధించారు.
సాయినాథుని ఆలయం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుణ్య నదులు, జీవనదుల జలాలు తీసుకొచ్చి 1008 కలశాలతో బాబా విగ్రహానికి అభిషేకం చేయడం మంచి విషయమని అన్నారు. ఈ అభిషేకం మహోత్సవంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాధవానంద స్వామి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఓ. శ్రీనివాస్ యాదవ్, మిరియాల రాఘవరావు, సత్యనారాయణ రెడ్డి, గుల్ మొహర్ పార్క్ అధ్యక్షుడు షేక్ ఖాసీం, నిరంజన్ రెడ్డి, మోహన్ రావు, అందెల కుమార్ యాదవ్, సాయి భక్తులు, సాయి సేవకులు ఆగ మయ్య గౌడ్, నేతాజీ నగర్ కాలనీ పెద్దలు, అసోసియేషన్ సభ్యులు, మహిళలు, గుల్ మొహర్ పార్క్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.