కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజల సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ. 5 లక్షల చెక్కులను లబ్దిదారులకు మంగళవారం ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రోజారంగారావు తో కలిసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు, నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు , కాశీనాథ్ యాదవ్, బ్రిక్ శ్రీను, ఎండీ ఇబ్రహీం, అల్లం మహేష్ ,అనిల్, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here