నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, వడ్డెర బస్తీ లో హెచ్ఎండబ్ల్యుఎస్ బోర్డ్ ద్వారా మంజూరైన రూ. 7.50 లక్షల అంచనా వ్యయం తో ఏర్పాటు చేసిన మంచి నీటి బూస్టర్ ను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రాజీవ్ నగర్, వడ్డెర బస్తీ వాసులకు మంచి నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఆన్ లైన్ బూస్టర్ ను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. వాటర్ వర్క్స్ బోర్డు నిధుల ద్వారా మంజూరైన నిధులతో చేపడుతున్న పాత పైప్ లైన్ లో కలుషిత నీరు చేరుతుందని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పాత పైప్ లైన్ స్థానం లో కొత్త పైప్ లైన్ వేయటం జరిగిందన్నారు. ఇక నుండి సురక్షిత మంచినీటి సరఫరా కానుందని, కాలనీ వాసుల సమస్య తీరనుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నగర ప్రజల కోసం నెలకు 20 వేల ఉచిత మంచినీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలు నివసించే ప్రతి ఇంటికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్లా కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రాజశేఖర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ నివర్తి, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, నాయకులు ఊట్ల కృష్ణ, పేరుక రమేష్ పటేల్, శశిధర్ రెడ్డి, నరసింహ సాగర్, జంగం గౌడ్, నరేష్ ముదిరాజ్, తిరుపతి యాదవ్, రవి గౌడ్, గువ్వల రమేష్, రాజేష్ యాదవ్, పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, రజనీకాంత్, బుడుగు తిరుపతి రెడ్డి, బాలరాజు, సత్తియ్య, గొలుసుల రాము, సిద్ధులు, సాయి శామ్యూల్ కుమార్, యూత్ నాయకులు దీపక్, కరీం, సాయి బాబు, సాయి సాగర్, అమీర్, జుబేర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.