నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటింటికి మంజీరా నీటిని అందజేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో నూతనంగా మంజూరైన మంజీరా పైపులైన్ అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరించి ప్రజక ఇబ్బందులను తీర్చడం జరుగుతుందని అన్నారు. డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్. రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీకి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం రాజేశ్వర్, డీజీఎం నాగప్రియ, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శాంతి నగర్ బస్తీ అధ్యక్షులు సుధాకర్, శ్యామ్, హాఫీజ్ పెట్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంది జ్ఞనేశ్వర్, నాయకులు సాదిక్, రాములు, రంగన్న, రాము, అక్బర్, కృష్ణ, గంగారాం ఎస్సీ సెల్ అధ్యక్షులు అనిల్ కుమార్, వాజిర్, మేనేజర్ సుబ్రమణ్యం రాజు, లైన్ మెన్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.