హక్కులను ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజాస్వామ్య వ్యవస్థకు అక్రమ నిర్బంధాలు, అరెస్టులు శోచనీయమని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసనలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం పిలుపు ఇవ్వడంతో మంగళవారం ఉదయం కసిరెడ్డి భాస్కరరెడ్డిని చందానగర్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రతిపక్ష పార్టీలపై దమన నీతిని కొనసాగించడం సరికాదన్నారు. బండి సంజయ్ కు మద్దతుగా జాతీయ నాయకత్వం నిలవడంతో కేసీఆర్ ప్రభుత్వం బెంబేలెత్తుతున్నదని అన్నారు. రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఉల్లంఘనలపై సైతం కేసులు నమోదు చేయాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బీజేపీ నాయకులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గృహనిర్బంధంలో కసిరెడ్డి భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here