కూతురు జన్మదినాన శ్రీ సరస్వతి విద్యాపీఠంకు రూ. 51 వేల విరాళం ఇచ్చిన కలివేముల మనోహర్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కలివేముల మనోహర్ కూతురు సాహితీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దుందిగల్ శ్రీ సరస్వతి ‌విద్యాపీఠంకు రూ. 51 వేల నగదును గురువారం మియాపూర్ లోని ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన కూతురు‌ సాహితీ పుట్టిన రోజును పురస్కరించుకుని సమాజానికి ఉపయోగపడేలా‌ ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. బీటెక్ 4 వ సంవత్సరం చదువుతున్న సాహితీ జన్మదినం సందర్భంగా ‌ఈ సంవత్సరం‌ శ్రీ సరస్వతి విద్యాపీఠం పాఠశాల ఉపాధ్యాయుల వేతనం నిమిత్తం రూ.51 వేలను విరాళంగా అందజేయడం జరిగిందన్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో ఇలాంటి మంచి కార్యక్రమాల వైపు ఆకర్షితులను చేస్తే భవిష్యత్తులో మరికొంత మందికి మార్గదర్శకులుగా మారుతారని మనోహర్ వెల్లడించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం దుందిగల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయణ కు తన కూతురు చేతుల మీదుగా అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ మహేష్, యాదగిరి కలివేముల, మహాలక్ష్మీ, మంజుల, సాయి వివేక్, రవి గౌడ్, నందు పాల్గొన్నారు.

జన్మదినం‌ సందర్భంగా రూ.51 వేల విరాళం అందజేస్తున్న సాహితీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here