నమస్తే శేరిలింగంపల్లి:హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వీణవంక మండలం, శ్రీరాములపేట, తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి ఎన్నిక ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజలందరూ బీజేపీ వైపు చూపుతున్నారని అన్నారు. అలాగే ప్రజల్లో మంచి స్పందన లభిస్తుందని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడిన, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు అని అన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆఖండ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాంచనమ్మ, మనోహర్, శ్రీశైలం, శ్రీధర్,రాజు శెట్టి, రవి గౌడ్, లక్ష్మణ్, శివ, రాజు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.