నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ రాక్షస పాలనకు చరమగీతం పాడే సమయం అసన్నమైందని , రాజగోపాల్ రెడ్డి చేరికతో బిజెపి బలం మరింత పెరిగిందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మునుగోడు లో జరిగిన అమీత్ షా భారీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.