నెలలు‌ నిండని పసిపాపకు మెరుగైన వైద్య చికిత్స – మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సిబ్బంది కృషి

నమస్తే శేరిలింగంపల్లి: నెలలు నిండని పసికందుకు మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ హెచ్ఓడీ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె మాట్లాడుతూ గర్భిణీ మహిళ తీవ్రమైన కడుపు నొప్పి అధిక బ్లీడింగ్ తో 2022 ఏప్రిల్ 20 వ తేదీన హాస్పిటల్ కి రాగా గర్భంలో శిశువు ఎదురుకాళ్లతో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకి సర్జరీ చేయకపోతే తల్లి, శిశువు ప్రాణాలకే ప్రమాదకరమని, సాధారణంగా ఇలాంటి ముందస్తు గర్భధారణ సమయంలో శిశువు ఊపిరితిత్తుల ఎదుగుదలకు తల్లికి స్టెరాయిడ్స్ ఇస్తామన్నారు. ఈ పేషెంట్ కు ఆ సమయం లేకపోవడంతో త్వరగా డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేవలం 24 వారల 6 రోజులలో (నాలుగు నెలల ముందు) మగ శిశువు పుట్టిన కారణంగా అతి తక్కువ బరువు, తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు.

నెలలు నిండని పసికందును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైద్య బృందం

ఆ శిశువుకి సత్వర వైద్యం అందించి వెంటిలేటర్ సహాయంతో శ్వాసను అందించి ఇంక్యూబేటర్లో ఎన్ఐసీయూకి మార్చగా 10 రోజుల తర్వాత ఇంక్యూబేటర్ నుంచి బయటకు తీసి కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్ తో శ్వాసను అందించినట్లు చెప్పారు. కొన్ని వారాల తర్వాత ప్రెషర్ ను మెల్లగా తగ్గిస్తూ హై ఫ్లో నాసల్ కాన్యులా ద్వారా కొన్ని రోజులు శ్వాసను అందించామన్నారు. తర్వాత శిశువు తనంతట తాను స్వంతంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో పుట్టిన 24 గంటల నుంచే శిశువుకి ఫీడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. మధ్యలో శిశువుకి ఇన్ఫెక్షన్స్ వచ్చిన విషయాన్ని గుర్తించి యాంటిబయోటిక్స్ చికిత్స అందించామని తెలిపారు. కామెర్లను ఫోటో థెరపీ ద్వారా నయం చేయగా శిశువుకి హార్ట్ లో డిఫెక్ట్ ఉండటం వలన రెండు డోసెస్ పారాసెటమోల్ ఇచ్చి దానికి చికిత్స చేయడం జరిగిందని చెప్పారు. దీనికి తోడు బ్రెయిన్ స్కాన్ లో క్లాట్ లు కనిపించడంతో డిశ్చార్జ్ సమయంలో బ్రెయిన్ స్కాన్ చేస్తే అంతా నార్మల్ గా ఉందన్నారు. కన్ను, గుండె, మెదడు పనితీరుని ప్రతిరోజు పర్యవేక్షించినట్లు చెప్పారు. శిశువు ఆరోగ్య సంరక్షణ మాకు, మా సిబ్బందికి ఒక సవాలుగా మారిందన్నారు. అత్యాధునిక ఎన్ఐసీయూ సదుపాయాలు ఉండటంతో అందరి సహకారంతో పాపను ఆరోగ్యవంతంగా కాపాడగలిగామని చెప్పారు. దీనికి సహకరించిన వైద్య సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి, శిశువు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒబెస్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధు మోహన్ రెడ్డి, నినాటోలోజిస్ట్ డాక్టర్ నవిత, సెంటర్ హెడ్ అనిల్, డీఎంఎస్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here