మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం – బిజెపి శేరిలింగంపల్లి ఇంచార్జీ గజ్జల యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమైందని బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ గజ్జల యోగానంద్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బిజెపి నిర్వహించిన ఆత్మ గౌరవ సభకు చందానగర్ డివిజన్ లోని గొల్లపల్లి రాంరెడ్డి గార్డెన్ నుండి చందానగర్ డివిజన్, శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి నాయకులు, కార్యకర్తలు గజ్జల యోగానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ మునుగోడు లో బిజెపి గెలుపు తథ్యమన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడుకు వస్తున్నారన్న భయంతో ఒక రోజు ముందే సీఎం కేసీఆర్ సభ నిర్వహించి సెంటిమెంట్ తో ప్రజలకు మాయమాటలు చెప్పారన్నారు.

మునుగోడు సభకు బయల్దేరే వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న గజ్జల యోగానంద్

ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో‌ లేరన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలపర్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. బహిరంగ సభకు బయల్దేరిన వారిలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, బుచ్చి రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, కాంచన కృష్ణ, రాజు శెట్టి కురుమ, గొల్లపల్లి రాంరెడ్డి, మహిపాల్ రెడ్డి, మారం వెంకట్, రాకేష్ దుబే, జి. శ్రీనివాస్ రెడ్డి, పవన్, శాంతి భూషణ్ రెడ్డి, బీమని విజయ లక్ష్మి, కృష్ణవేణి స్వాతి, శివ కుమార్ వర్మ, సైఫుల్ల ఖాన్, వేణు గోపాల్, సత్య కుర్మా, బాలరాజు, పి.కౌసల్య, బి. సత్యనారాయణ, జే. శ్రీకాంత్, సాయి వెంకట్ గౌడ్, చందర్ రావు, పోచయ్య, బసవ రాజు,రాం మోహన్ రావు, అనంత రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ రమణ కుమారి, శరణ్య, ముబినా, కల్పన, శ్రీకాంత్, జగదీష్, సాయి, కోటేశ్వరరావు, మురళి, అమృత రెడ్డి, శివ తదితరులు ఉన్నారు.

మునుగోడు సభకు‌ బయల్దేరిన శేరిలింగంపల్లి ‌బిజెపి‌ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here