ఇందిరాన‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన ర‌వికుమార్ యాద‌వ్‌… స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని జ‌డ్సీకి విన‌తి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ఇంద్రనగ‌ర్‌లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్‌, స్థానిక కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డిలు శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై ఆరాతీశారు. ప్ర‌ధానంగా డ్రైనేజీ స‌మ‌స్య‌పై బ‌స్తీవాసులు త‌మ గోడు వెలిబుచ్చారు. చిన్న‌పాటి వ‌ర్షానికే రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యమ‌యమ‌వుతున్నాయ‌ని, మురుగునీరు ఉప్పొంగి అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్పందించిన ర‌వికుమార్ యాద‌వ్‌, గంగాధ‌ర్‌రెడ్డిలు బాదితుల‌తో క‌ల‌సి శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌నర్ ర‌వికిర‌ణ్‌తో పాటు సంబంధిత అధికారుల‌కు క‌లిశారు. ఇందిరాన‌గ‌ర్‌తో పాటు శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో నెల‌కొన్న అనేక స‌మ‌స్య‌ల‌పై ర‌వికుమార్ యాద‌వ్ జ‌డ్సీతో చ‌ర్చించారు. సానుకూలంగా స్పందించిన జ‌డ్సీ ప్రాధాన్య‌తా క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌న్నింటిని ప‌రిష్క‌రించేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్‌ కార్పొరేటర్ ఎల్లేష్, నాయ‌కులు భారత్, రాంచందర్ యాదవ్, వెంకట్ రెడ్డి, హనుమంతు నాయక్, ఈశ్వర్, తిరుపతి, రమేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఇందిరాన‌గ‌ర్‌లో డ్రైనేజీ స‌మ‌స్య తీవ్ర‌త‌ను ర‌వికుమార్ యాద‌వ్‌కు వివ‌రిస్తున్న స్థానికులు
జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌తో మాట్లాడుతున్న ర‌వికుమార్ యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here