డ‌బ్ల్యూఏసీ బెస్ట్‌ యూత్ ఐకాన్‌గా ఏఎస్‌వైఎఫ్‌… అవార్డు అంద‌జేసిన సుప్ర‌జ గ్రూప్స్ అధినేత తుడి ప్ర‌వీణ్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఆయువ్ స్టుడెంట్ యూత్ ఫౌండేష‌న్‌కు వండ‌ర్ అమెజింగ్ క్రియేటీవ్‌(డ‌బ్ల్యూఏసీ) ఇంట‌ర్నేష‌న‌ల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి బెస్ట్ యూత్ ఐకాన్ ల‌భించింది. ఆయూవ్ ఫౌండేష‌న్ స్థాపించి గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా చేస్తున్న సేవ‌ల‌కు ఈ పుర‌స్కారం దక్కింది. కాగా సుప్ర‌జ గ్రూప్స్ అధినేత తుడి ప్ర‌వీణ్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ రోహిత్ ముదిరాజ్‌కు శుక్ర‌వారం డ‌బ్ల్యూఏసీ పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ఇదే స్పూర్తిత‌తో సేవ కార్య‌క్ర‌మాలు విస్త్రుతం చేయాల‌ని పేర్కొంటు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. యువత ఏఎస్‌వైఎఫ్‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలిన తుడి ప్ర‌వీణ్ సూచించారు. త‌మ ఫౌండేష‌న్ ఇంత‌టి పుర‌స్కారం ల‌భించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని, ఇదంతో ఫౌండేష‌న్ సభ్యులంద‌ని నిస్వార్ధ సేవ‌కు ద‌క్కిన గుర్తింపు అని రోహిత్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా డబ్ల్యూఏసీ బుక్ ఆఫ్ రికార్డ్స్ టీమ్‌కు, సుప్ర‌జ ప్ర‌వీణ్‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ రోహిత్ ముదిరాజ్‌కు అవార్డును అంద‌జేస్తున్న సుప్ర‌జ గ్రూప్స్ అధినేత తుడి ప్ర‌వీణ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here