విద్యాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది: ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ ‌గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ శేరిలింగంపల్లి బాలుర పాఠశాల-1,జూనియర్ కళశాలలో విద్యార్థులకు సోమవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడం‌ జరుగుతుందని అన్నారు. విద్యాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు. పేదలకు గురుకుల పాఠశాలలు ఒక వరం అని, అర్హులైన ప్రతి  పేద‌ విద్యార్థికి గురుకులంలో అవకాశం లభిస్తుందన్నారు. అనంతరం ఏడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ శేరిలింగంపల్లి ప్రిన్సిపాల్ చంద్ర రెడ్డి, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు,డివిజన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్,టీఆర్ఎస్ నాయకులు అష్రఫ్,ఖాదీర్,షరీఫ్, యాసిన్,మహిళ నాయకులు ఫర్వీన్ సుల్తానా,మాధవి తదితరులు పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ ‌విప్ ఆరెకపూడి‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here