గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా లు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.