ప్ర‌పంచ జ‌నాభాలో ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు భార‌తీయుడు: తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్‌

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆద్వ‌ర్యంలో ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ సూపర్ విజ్ జూనియర్ క‌శాశాల‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్ర‌వారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా వల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు వివరించి నివారణ చర్యలు చేపట్టటమే ముఖ్య ఉద్దేశ్యంగా ఐక్యరాజ్య సమితి వారు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల వలన దేశాభివృద్ధికి అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయ‌ని, దీని వలన ముఖ్యంగా ఆహారం, పరిశుభ్రమైన త్రాగునీరు, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల లేమి ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. అదేవిధంగా నిరుద్యోగం, పర్యావరణంకు విఘాతం కలగటం తదితర సమస్యల‌ వలన అభివృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తుంద‌ని అన్నారు. అధిక జనాభా వలన ప్రకృతి ప్రసాదించిన వనరులు కూడా రోజురోజుకు తగ్గిపోతాయ‌ని అన్నారు. ప్రపంచ జనాభాలో భారతదేశం 17.75 నిష్పత్తి జనాభా కలిగివుంద‌ని, అత్య‌ధిక‌ జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంద‌ని గుర్తు చేశారు. ప్రపంచ జనాభా లో ప్రతి 6 గురిలో ఒకరు భారతీయుడు ఉంటాడ‌ని తెలిపారు.

ఆశావ‌ర్క‌ర్ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్‌, స‌భ్యులు

భారతదేశంలో జననాల సంఖ్య ప్రతి సెకనుకు ఒకరు జన్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క సెకనుకు ఐదుగురు జన్మిస్తున్నారు, ఇద్దరు మరణిస్తున్నారు అని తెలిపారు. ఇదే విధంగా జనాభా పెరుగుదల ఉంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంద‌ని, జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఏకైక పరిష్కారమార్గం కుటుంబ నియంత్రణ అని అన్నారు. జ‌నాభ నియంత్ర‌ణ‌కు ట్యూబెక్టమీ, వాసేక్టమి ఆపరేషన్స్ మరియు కుట్టు, కోతలేని బిపిల్ ఆపరేషన్స్ శాశ్వత పరిష్కారాలైతే కండోమ్స్ వాడటం, కాపర్ టీ( ఐయూసీడీ), ఓరల్ పిల్స్, తదితర మార్గలు తాత్కాలికం అన్నారు. వాటిని ఆచరించిన ఎడల పెరుగుతున్న జనాభాను అరికట్టవచ్చున్నారు. ప్రభుత్వంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దంపతులంద‌రూ (మహిళలు 45, పురుషులు 55 సంవత్సరాలు ) కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాల‌న్నారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణకు ఇతోధికంగా కృషిచేస్తున్న ఆశ వర్కర్ల‌కు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు, విష్ణు ప్రసాద్, భాస్కర్ రెడ్డి, పాకాలపాటి శ్రీనివాస్, జిల్ మల్లేష్, తిరుమలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here