శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ గ్రీన్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ లో విద్యార్థులకు ఎమర్జెన్సీ డే సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మాదాపూర్ బీజేపీ తరపున శివ యాదవ్, ఆనంద్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మాదాపూర్ డివిజన్ బిజెపి కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు వేణు గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం రాధకృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగి భారత దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన, దేశ ప్రజల గొంతునొక్కెవిధంగా, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, హక్కులను కాలరాస్తూ తన నియంత పూరిత అధికార ధోరణి తో దేశ చరిత్ర లో జూన్ 25, 1975 న ఎమర్జెన్సీ పేరుతో ఒక చీకటి అధ్యాయానికి అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజల జీవితాల్లో అంధకారాన్ని మిగిల్చిన జూన్ 25 ని మనం అందరం భాద్యత గల భారత పౌరులుగా రాజ్యాంగ అవమానాన్ని నిరసిస్తూ సంవిధాన్ హత్యా దివస్ గా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ గరికపాటి, సెక్రటరీ శ్రీగిరి సత్యనారాయణ, బాలు నాయక్, నరేష్ రెడ్డి, శీను నాయక్, రాము, నవీన్, లింగస్వామి, వంశీ, రాజవర్ధన్ రెడ్డి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, విద్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.