యాదవుల ఆత్మగౌరవ‌ సభను విజయవంతం చేయాలి: భేరి రామ్ చందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జూన్ 30న తెలంగాణ ఉద్యమ నాయకుడు బిసి జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ యాదవుల ఆత్మగౌరవ సభ, ఇందిరాపార్క్ వద్ద ధర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, మహాసభ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యాదవుల ఆత్మ గౌరవ సభ పోస్టర్‌ ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ బీసీల‌కు అన్ని రంగాల్లోనూ అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. మంత్రి వ‌ర్గంలో స్థానం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. బీసీలు ఉండాల్సిన ప‌ద‌వుల్లో అగ్ర కులాల‌కు చెందిన వారు ఉన్నార‌ని అన్నారు. యాద‌వుల హ‌క్కుల సాధ‌న‌కు యాద‌వులంద‌రూ ఏక‌తాటిపైకి రావ‌ల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, మధు యాదవ్, శంకర్ యాదవ్, శివ యాదవ్, హరి శంకర్ యాదవ్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here