శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ మాజీ ప్రధాని, మనందరికీ మార్గదర్శకుడు, సంరక్షకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం మనందరికీ తీరని లోటని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు, నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ న్యూ ఢిల్లీ NGO ఛైర్మన్ గురుదేవ్జీ నెల్లి అన్నారు. మన్మోహన్ సింగ్ స్మారకార్థం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో నివాళులర్పించే సభను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.