సావిత్రిబాయి పూలేకు కేవీపీఎస్ నాయ‌కుల  ఘ‌న నివాళి

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(KVPS) శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో చందానగర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల కార్యదర్శి ఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తి అని అన్నారు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్క మనిషిని ప్రేమించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సి.శోభన్. సిఐటియు మండల కార్యదర్శి కృష్ణ, రేణుక, లక్ష్మమ్మ ,నిర్మల, పాత్రికేయులు సదా నరేష్ శ్రీను ,రాజేష్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here