శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో Dr. చంద్రశేఖర్, Dr. అనురాగిణి, మరి కొంతమంది డాక్టర్లకు హఫీజ్ పేట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులు ప్రతిరోజూ చేసే అచంచలమైన సేవ, త్యాగాలను కొనియాడారు. మానవత్వం పట్ల వారి కరుణ, ధైర్యం, నిబద్ధతకు అందరు వైద్యులకు వందనం చేస్తున్నామని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, రమణ, నరసింహ, లక్ష్మీనారాయణ గౌడ్, ఆనంద్ గౌడ్, కరుణాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, లయన్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.