శేరిలింగంపల్లి, జూలై 1 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీసీ జనసభ అధ్యక్షుడు జేఏసీ కన్వీనర్ రాజారాం యాదవ్, యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద యాదవ కుల సంఘాల, ప్రముఖ యాదవ రాజకీయ, వ్యాపార పారిశ్రామికవేత్తల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజారామ్ యాదవ్, రమేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని, యాదవుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని అన్నారు. యాదవులకు గొర్రెల మేకల పంపిణీ కార్యక్రమం పునః ప్రారంభించాలని, ఎమ్మెల్సీ పదవుల్లోనూ ఇతర చైర్మన్ పోస్ట్ లలోనూ యాదవులకు సమచిత స్థానం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కాంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ శ్రీదేవి, కార్పొరేటర్ లలిత, బేరి రామ్ చందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.