- గొల్ల కురుమల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మంత్రికి వినతి
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని కోరుతూ అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ యాదవ్ లు సోమవారం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ చందర్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమల కోసం సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మొదటి విడతలో 50 శాతం మందికి గొర్రెలను పంపిణీ చేశారన్నారు. రెండో విడత కోసం గొల్ల కురుమలు బ్యాంకుల్లో డీడీలు కట్టారని, త్వరలో వారికి గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు. అలాగే గొర్రెలకు సీజనల్ వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు మందులు వేసేలా చూడాలని, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, పెంచిన గొర్రెలను అమ్మడంలో దళారుల వల్ల నష్టపోతున్నందున ఆ సమస్య లేకుండా చూడాలని, నియోజకవర్గ కేంద్రంలో గొర్రెలను అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఇందుకు స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నడికుడి రఘునాథ్ యాదవ్, జిల్లా యాదవ సంఘం సీనియర్ నాయకుడు ఒ.శ్రీనివాస్ యాదవ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ జీడి కంటి మహేందర్ యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షుడు దొంతి పోయిన శ్రీనివాస్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, ప్రభాకర్ యాదవ్, శంషాబాద్ యాదవ సంఘం నాయకులు నగేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, కొమరవెల్లి మోహన్ యాదవ్, కుమార్ యాదవ్, రమేష్ యాదవ్, మొయినాబాద్ మండలం యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ యాదవ్, మల్లేష్ యాదవ్, రఘు యాదవ్, అశోక్ యాదవ్, నర్సింగ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సుభాష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.





