మాదాపూర్‌లో ఘ‌నంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

మాదాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 48వ జన్మదినం సందర్భంగా మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని గోకుల్‌ ఫ్లాట్స్‌లో ఉన్న డ్రీమ్‌ ఫర్‌ గుడ్‌ సొసైటీ సంస్థలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. సొసైటీలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్‌ నాయకుడు నరాల మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌ రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సురేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, రాంరెడ్డి, సొసైటీ నిర్వాహకురాలు చావా అరుణ, అధ్యాపకులు, విద్యార్థులు, గోకుల్‌ ఫ్లాట్స్‌ వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

డ్రీమ్ ఫ‌ర్ గుడ్ సొసైటీలో చిన్నారుల‌తో క‌లిసి కేక్ ను క‌ట్ చేస్తున్న క‌రుణాక‌ర్ రెడ్డి, న‌రాల మ‌హేశ్వ‌ర్ రెడ్డి
వేడుక‌ల్లో పాల్గొన్న చిన్నారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here