వివేకాందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్ పల్లి (పార్ట్) డివిజన్లకి చెందిన పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి సోమవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా ఉన్నప్పటికీ ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఆగలేదన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నే శ్రీనివాస రావు, రోజా రంగారావు, మాజీ కార్పొరేటర్ రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల భాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, దొడ్ల రామకృష్ణ గౌడ్, సైదేశ్వర్, చంద్రమౌళి సాగర్, అనిల్ రెడ్డి, జగదీష్, గోపి, కవిత పాల్గొన్నారు.