చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్, హరిజన్ బస్తీ, శివాజీ నగర్, న్యూ శంకర్ నగర్, కైలాష్ నగర్ బస్తీ, ఇందిరా నగర్, వేమన వీకర్ సెక్షన్ బస్తీ, వేముకుంట బస్తీ, కైలాష్ నగర్ కాలనీ, జవహర్ కాలనీలలో వరద ముంపు బాధితులకు రూ.10వేల ప్రభుత్వ సహాయాన్ని శనివారం కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరద బాధితులకు రూ.10వేలు పంపిణీ చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. డివిజన్ పరిధిలో వరద బాధితులందరికీ సహాయం అందేలా చూస్తామన్నారు. ఆమె వెంట జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.