శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్)లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో విద్య అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒక్కరు ఉన్నతంగా చదువుకుంటే ఆ కుటుంబ భవిష్యత్తే మారిపోతుందని అన్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, పట్టుదలతో కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో విద్యపై శ్రద్ధ పెట్టి, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలను వీక్షించి వారి ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





