- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శనివారం గోపాల్ రెడ్డి నగర్, అంజయ్య నగర్, బంజారానగర్ లలోని పలు బస్తీలలో బాధిత కుటుంబాలకు రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ పంపిణీ చేశారు. పేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పెద్ద మనసుతో కష్ట కాలంలో ఉన్న పేదల పాలిట ఆపన్నహస్తుడై అక్కున చేర్చుకొన్న సీఎం కేసీఆర్ పట్ల ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.

కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట ఏఈ శ్రీనివాస్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డు మెంబర్స్ నరసింహ సాగర్, జంగం గౌడ్, సెక్రటరీ బలరాం, ఏరియా కమిటీ మెంబర్స్ కరీం, రవి శంకర్ నాయక్, ఎర్రరాజు, హీనాయత్, యూత్ నాయకులు దీపక్, జుబేర్ తదితరులు ఉన్నారు.






