కొండాపూర్‌లో గ్రీన్ గార్డియన్స్ కార్యక్రమం.. ప్రతి కాలనీలో మొక్కలు నాటాలని రవికుమార్ యాదవ్ పిలుపు..

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచుతామో, మొక్కలను కూడా అదే విధంగా సంరక్షించాలని ఆయన అన్నారు. శ్రీ సనాతన ఆయుర్వేద, శ్రీ సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రీన్ గార్డియన్స్ పేరుతో ప్రతి కమ్యూనిటీ, ప్రతి కాలనీలో మొక్కలు నాటే లక్ష్యంతో మసీద్‌బండ క్యామ్లాట్ లేఅవుట్ పార్క్‌లో నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 8వ బెటాలియన్ కమాండెంట్ ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ రాంబాబు తదితరులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరాల్లో వేగంగా పెరుగుతున్న నిర్మాణాలతో పచ్చదనం తగ్గిపోతుండటం ఆందోళనకరమని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి కాలనీ, ప్రతి కమ్యూనిటీలో విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సనాతన ఆయుర్వేద, శ్రీ సరస్వతి దేవి అనురాగధార ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చెట్లు ప్రకృతికి ప్రాణాధారమని, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక చెట్టు, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సనాతన ఆయుర్వేద చైర్మన్ లక్ష్మీ, శివాజీ యువసేన అధ్యక్షుడు యోగేష్ ప్రభు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, రెడ్‌క్రాస్ యూత్ కన్వీనర్ మణిదీప్, వర్టికల్ వరల్డ్ ఫౌండర్ సుకుమార్ దాస్, భాగ్యనగర్ బీజేవైఎం అధికార ప్రతినిధి నవీన్ కుమార్, సిద్ధిపేట యూత్ అధ్యక్షుడు అనూప్ కుమార్, పవన్ శర్మ, మేరీ, జ్యోతి, మీనమ్మ, కల్పన, మసీద్‌బండ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here