హైదర్‌నగర్ మైసమ్మ ఆలయంలో బోనం సమర్పించిన గణేష్ యాదవ్

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆషాడ మాసం సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ గ్రామానికి చెందిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గణేష్ యాదవ్ హైదర్‌నగర్‌లోని మైసమ్మ అమ్మవారి ఆలయంలో బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, గంగల నరసింహ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, గంగల జంగయ్య యాదవ్, గంగల మల్లేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్, ఉప్పల ఏకాంత్ గౌడ్, నారగోని కృష్ణ గౌడ్‌, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here