శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదిన వేడుకలను ఆయన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, రాగం నాగేందర్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






