శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ERO), జోనల్ కమిషనర్ ఎస్ఎల్పీజెడ్, సిఎంసి ఆధ్వర్యంలో నమోదిత రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs)తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతి నివేదికలతో పాటు ASD (Absent/Shifted/Death) జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులు, BLAsకు అందజేశారు. కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి బూత్ లెవల్ అధికారులు (BLOలు)కు పూర్తి సహకారం అందించాలని అధికారలు కోరారు.

ఈ సందర్భంగా AERO మాట్లాడుతూ ఆగస్టు 3లోపు సంబంధిత BLOలకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు జాబితా (Draft Electoral Roll)లో ప్రచురించబడవని స్పష్టం చేశారు. అలాగే ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా జూలై 31 వీలైనంత త్వరగా ఎన్యుమరేషన్ ఫారాలను BLOలకు అందజేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నివాసం మార్చిన వారు, మరణించిన వారు లేదా ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదైనట్లు గుర్తించిన వారి పేర్లు, భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ధ్రువీకరణ అనంతరం ఓటరు జాబితా నుంచి తొలగించబడతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు నిర్దేశిత గడువులోపు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించి, తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదయ్యేలా BLOలకు సహకరించాలని AERO పిలుపునిచ్చారు.





