శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై బీజేపీ ఆధ్వర్యంలో మండల ప్రవాస్ అభియాన్ నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా పార్టీ సూచనల మేరకు హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హఫీజ్‌పేట్ డివిజన్ ఇంచార్జి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగుడ్ల ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతినగర్, హుడా కాలనీ, గంగారం, ఇంజనీర్ ఎన్‌క్లేవ్, ఆల్విన్ కాలనీ, హఫీజ్‌పేట్ గ్రామం, మైత్రీనగర్, మదీనాగూడ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను స్థానిక బీజేపీ బీఎల్‌ఏ-2 నాయకులు, బీఎల్‌ఓ అధికారులతో కలిసి పరిశీలించారు. SIR ప్రక్రియ సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేలా అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

మధ్యాహ్నం సాయినగర్‌లో హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ నివాసంలో భోజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆల్విన్ కాలనీలో డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్‌లతో సమావేశమై, రానున్న రోజుల్లో పోలింగ్ బూత్ కేంద్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు బోయిని మహేష్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రవి గౌడ్, శ్రీధర్ రావు, కోటేశ్వర్ రావు, సీనియర్ నాయకురాళ్లు వినయ, పార్వతి, నాయకులు పవన్, సురేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, ఉపాధ్యక్షులు ప్రసాద్ పాత్రో, రాజు యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, నాయకులు శేఖర్ ముదిరాజ్, స్వామి, యువ మోర్చా అధ్యక్షుడు మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, సాయి నాయక్, చెన్న కేశవ, నరేష్, విజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.





