పట్నం రుక్కమ్మ మృతి ప‌ట్ల ఆరెకపూడి గాంధీ సంతాపం

శేరిలింగంపల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ ఇటీవల క‌న్నుమూసిన విషయం తెలుసుకున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మంగళవారం షాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బాలింగ్ గౌతమ్ గౌడ్ ల‌తో కలిసి రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ఆరెకపూడి గాంధీ.. పట్నం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here