వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్, రిక్షాపుల్లర్స్ కాలనీ, రామకృష్ణా నగర్, హనుమాన్ నగర్ లలో వరద భాదితులకు కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావులు ప్రభుత్వ సహాయం రూ.10వేలు పంపిణీ చేశారుఉ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితులకు అండగా ఉంటామన్నారు. అన్ని వేళలా సహాయం చేసేందుకు ప్రభుత్వం, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, గొట్టిముక్కుల పెద్ద బాస్కర్ రావు, నాయినేని చంద్రకాంత్ రావు, ఎం.రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్స్, ఏరియా కమిటీ మెంబర్స్, కాలనీ వాసులు పాల్గొన్నారు.