వ‌ర‌ద బాధితులంద‌రికీ స‌హాయం అందేలా చూస్తాం

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కూక‌ట్‌ప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూక‌ట్‌ప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని దీన‌బంధు కాల‌నీలో వ‌ర‌ద బాధితుల‌కు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వ‌ర‌ద స‌హాయం రూ.10వేల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వ‌ర‌ద ముంపు బాధితుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని అన్నారు. బాధితులంద‌రికీ రూ.10వేల స‌హాయం అందేలా చూస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని స‌మ‌యాల్లోనూ అండ‌గా ఉంటామ‌న్నారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ
బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ

ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, మహేందర్, మహేష్, శ్రీధర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here