రిక్షాపుల్ల‌ర్స్ కాల‌నీ, రామ‌కృష్ణాన‌గ‌ర్‌ల‌లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

వివేకానంద నగర్ ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజ‌న్ ప‌రిధిలోని రిక్షాపుల్లర్స్ కాలనీ, రామకృష్ణా నగర్ లలో వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్నికార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, నాయ‌కుడు మాధవరం రామారావు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ముంపునకు‌ గురైన బాధితులకు ముఖ్యమంత్రి అందజేస్తున్న రూ. 10 వేలను అందజేయడం పట్ల వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయింద‌ని అన్నారు. ఎవరూ కూడా అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటూ అండదండలు అందజేస్తుందని తెలియజేశారు. అన్ని వేళలా సహాయక చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, నాయ‌కుడు మాధవరం రామారావు

ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు, నాయ‌కులు గొట్టిముక్కుల పెద్ద భాస్కర్ రావు, మొలుగు హిమగిరి రావు, ఎం.రంగారావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here