చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, రాజీవ్ నగర్, టెలిఫోన్ కాలనీ, వెంకటాద్రి నగర్ కాలనీలలో తెరాస నాయకుడు, మాజీ ఫ్లోర్ లీడర్ రఘుపతి రెడ్డి, డివిజన్ తెరాస వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డిలు బుధవారం వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.
