చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్, వేముకుంట, శివాజీనగర్, వేమన వీకర్ సెక్షన్, ఇందిరా నగర్, భవానిపురం, పీఏ నగర్ తదితర బస్తీలలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి బుధవారం వరద బాధితులకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని డీసీ సుధాంష్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరదల వల్ల ఇబ్బందులు పడ్డ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితులకు రూ.10వేలు అందిస్తున్నందుకు ఆమె సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.