నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కి చెందిన వినోద్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని, ఈ సంవత్సరంలో 2వేల మంది లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం ద్వారా కారును కొనుగోలు చేసిన లబ్ధిదారుడు వినోద్ మాట్లాడుతూ కారుకు యజమానిగా చేసి స్వయం ఉపాధి పొందే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, నాయకులు బ్రిక్ శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.