చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలో వర్షాల వల్ల దెబ్బతిన్న కృష్ణదేవరాయ కాలనీకి వెళ్లే తాగునీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఆమె శుక్రవారం పరిశీలించారు. పనులను త్వరగా చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో HMWSSB జనరల్ మేనేజర్ రాజశేఖర్, DGM నాగప్రియ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.