హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని జనప్రియ, రామకృష్ణ నగర్, మదీనాగూడ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ శుక్రవారం పర్యటించారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇంకా నిలిచి ఉండడంతో సహాయక చర్యలు చేపట్టారు.
25 అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తొలగింపజేయించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె రామకృష్ణ నగర్‌లో వాచ్‌మెన్ ల కుటుంబాలకు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, వాలా హరీష్ రావు, విష్ణు, ఉమామహేశ్వర తదితరులు పాల్గొన్నారు.