చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): డిగ్రీ పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. గురువారం కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి దంపతులు చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్‌ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజా స్వామ్య పరిరక్షణకు పాటు పడాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు.






