శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కి చెందిన సాకీమా బేగం అనే మహిళకు వైద్య సహాయం నిమిత్తం హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి చేయూతను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్‌కుమార్, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.