శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ గురువారం భేరి వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్టు తరఫున మల్కాజ్‌గిరిలోని మదర్ ఇండియా అనాథాశ్రమానికి రూ.5వేల విరాళం అందజేశారు.

ఈ సందర్బంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవ అని తలచి ప్రతి ఏటా తనకు తోచిన రీతిలో అనాథాశ్రమాలకు సహాయం అందిస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా మదర్ ఇండియా ఆశ్రమానికి విరాళం అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ సహాయం అవసరం ఉన్నవారికి చేయూత అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు జి వెంకటస్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.