కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీలోని గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌కు కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు కార్పొరేటర్ హమీద్ పటేల్ ను సన్మానించారు. ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసి రెండవ సారి కార్పొరేటర్ గా గెలిపించినందుకు గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గతంలో అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను పరిష్కరించటం జరిగిందన్నారు.

ముఖ్యంగా అసోసియేషన్ సభ్యులు కోరిన విధంగా పార్కులో అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, పార్కును అభివృద్ధి పరుస్తానని, తన సొంత నిధులతో పార్కును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ లోని ప్రధాన వీధులలో సీసీ రోడ్లు పూర్తి చేశామని, మిగిలిన ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్ల నిర్మాణ పనులను అతి త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని, అక్కడక్కడా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేస్తామని, గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా తన దృష్టికి సమస్యలను తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోల్డెన్ తులిప్ ఎస్టేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె విద్యాసాగర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎస్వీఎన్ రాజు, జనరల్ సెక్రటరీ రేవతి, జాయింట్ సెక్రటరీ సి.అమర్‌నాథ్, ట్రెజరర్ కె.బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎల్.రమాకాంత్, ఎం.రాకేష్, యూత్ నాయకులు దీపక్, ముక్తార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.





