మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): సంజీవరెడ్డి నగర్ బ్రహ్మ కుమారి కేంద్రం ఇన్చార్జీ సరోజిని హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ లోని కేంద్రంలో బ్రహ్మ కుమారిలు సరోజిని, శైలజ, ఈశ్వరి, కుమారిలతోపాటు ప్రణవ్, చంద్రశేఖర్ లు కార్పొరేటర్ దంపతులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా డివిజన్ల పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని, డివిజన్లను అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు.






