చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జోన్ అధ్యక్షుడు ఊటుకూరి శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, కోశాధికారి గౌరీ శంకర్ల ఆధ్వర్యంలో చందానగర్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఫెడరేషన్ చందానగర్ అధ్యక్షుడిగా కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా పబ్బ శ్రీనివాస్, వినయ్, జాయింట్ సెక్రటరీగా భరత్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ చందానగర్ వైశ్య సంఘం సంక్షేమం, అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు.